కె.వి.కె. బనవాసి రైతు పి.శ్యామ్ కు కేంద్ర ప్రభుత్య పథకం ద్వారా లబించిన 5 లక్షల విలువగల
గ్రామ స్థాయి మట్టి పరీక్షా కేంద్రం
డా.జి. ప్రసాద్ బాబు,కార్యక్రమ సమన్వయకర్త, యం. జయలక్ష్మీ, శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం,బనవాసి
కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు దత్తత గ్రామాలలోని రైతులకు అనేక స్వల్ప మరియు దీర్ఘకాలిక నైపుణ్యభివృద్ది
శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూఉంది. ఇందులో భాగంగానే నాగలపురం గ్రామ రైతులకు కూడా
భూసార పరీక్షల విధానాలు మరియు విశ్లేషణపై శిక్షణాకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో శిక్షణ
పొంది బి.ఎస్.సి. (B.Sc. - BZC) అర్హత కలిగిన పి.శ్యామ్ (ఫో.నెం.9290142904) అనే రైతు గ్రామస్థాయిలో
భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే తమసొంత గ్రామంలోనే గాక ఇతర గ్రామాలలో రైతులకు
భూసార పరీక్షల ఉపయోగాలు మరియు భూసార ఆధారిత ఎరువుల వాడకం పై అవగాహన కల్పించి తద్వారా
స్వయంఉపాధి పొందాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను కలవడం జరిగింది.